Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:26 AM

సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు

14-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అందరితో ఆనందాన్ని పంచుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం మరియు ఉచిత కంటి పరీక్ష శిబిరాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువత, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయగా, ప్రజలు ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Sthanikam

సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News