తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి ఇటీవల శ్రీరాముడు, పరమశివుడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వలిగొండ క్రాస్ రోడ్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలిపారు. శ్రీరాముడిని ధనికులకు, శివుడిని పేదలకు ప్రతీకగా పేర్కొంటూ సీఎం చేసిన వాఖ్యలు తీవ్ర అభ్యంతరంకరమని, అవి కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కూడా వారు తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు భాషా సంస్కారాన్ని పాటించాలని, హిందూ దేవతలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని హితవు పలికారు. రాముడైనా, శివుడైనా హిందువులందరికీ ఆరాధ్య దైవాలని, సమాజాన్ని విభజించేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా వలిగొండ క్రాస్ రోడ్ వద్ద గుమ్మడికాయపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి పగలగొట్టడంతో పాటు, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు కడారి కల్పన ఐలయ్య యాదవ్, రూరల్ అధ్యక్షుడు కైరం కొండ అశోక్, సీనియర్ నాయకులు రమణగోని శంకరయ్య, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చినుకుని మల్లేశం, కౌన్సిలర్లు బుడ్డ సురేష్, పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, సర్పంచులు తంగళ్ల వెంకటేశం, నందగిరి వెంకటేశం గౌడ్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, బత్తుల జంగయ్య గౌడ్, కాయతి రమేష్ గౌడ్, దిండు భాస్కర్, కట్ట కృష్ణ, ఉడుగు వెంకటేశం గౌడ్, బాతరాజు ధనుంజయ, ఆనగంటి విష్ణుకాంత్, అమృతం దశరథ, బడుగు కృష్ణ, యాస అశోక్ రెడ్డి, పబ్బతి శేఖర్, లగ్గొని పాండు, కానుగు కొండల్, తేలుకుంట్ల శ్రీధర్, వివిధ బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం.. చౌటుప్పల్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం

K.RAVI

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి