Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:25 AM

సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు హేయం

01-02-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బేషరతుగా క్షమాపణ చెప్పాలి

అమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ డిమాండ్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను అమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ తీవ్రంగా ఖండించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో అంబటి రాంబాబు తీరుపై ఘాటు విమర్శలు చేశారు.రాజకీయాల్లో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ, అంబటి వ్యాఖ్యలు అత్యంత నీచమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో నోరు పారేసుకున్న కారణంగానే ప్రజలు వైసీపీని పదకొండు స్థానాలకే పరిమితం చేశారని, ఘోర పరాజయం ఎదురైనా అంబటి రాంబాబుకు సిగ్గు రావడం లేదని మండిపడ్డారు. వైసీపీ మళ్లీ బూతుల సంస్కృతిని రాజకీయాల్లోకి తెచ్చి రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తోందని ఆరోపించారు.

గొడవలు, హత్యలకు ప్రయత్నించే ధోరణిని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంబటిని రాజకీయాల నుంచి బహిష్కరించాలని కోరారు. నోరును అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు.

Sthanikam

సీఎం చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు హేయం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News