Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:23 AM

స్వయం ఉపాధితో మహిళలు ఆత్మవిశ్వాసంగా ఎదగాలి – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

13-05-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని బాలసదనంలో ‘మిషన్ శక్తి - బేటీ బచావో బేటీ పడావో’ పథకం కింద నిర్వహించిన వొకేషనల్ టైలరింగ్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు వేడుకలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న బాలికలకు సర్టిఫికెట్లను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని, బాలికలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టైలరింగ్ వంటి వృత్తి నైపుణ్యాలు భవిష్యత్తులో బాలికలకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ స్ఫూర్తితో బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా మహిళలు, యువతుల కోసం ఇలాంటి మరిన్ని శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బాలసదన నిర్వాహకులు, మున్సిపల్ అధికారులు, శిక్షణ సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

స్వయం ఉపాధితో మహిళలు ఆత్మవిశ్వాసంగా ఎదగాలి – ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News