హైదరాబాద్, అక్టోబర్ 01స్థానికం ప్రతినిధి::
పరిశుభ్రత ఒక్కరోజు కార్యక్రమం కాదని, ప్రతిరోజూ కొనసాగించాల్సిన బాధ్యత అని పీఐబీ హైదరాబాద్ ఏడీజీ శ్రుతి పాటిల్ అన్నారు. కవాడిగూడలోని సీజీఓ టవర్స్‌లో గురువారం ‘స్వచ్ఛతా హీ సేవా–2026’లో భాగంగా ‘ఏక్ దిన్.. ఏక్ ఘంటా.. ఏక్ సాథ్’ శ్రమదానం నిర్వహించారు. పీఐబీ, సీబీసీ అధికారులు, సిబ్బంది పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా శ్రుతి పాటిల్ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ భారత్ ఉద్యమం ముందుకు సాగుతోందన్నారు. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సీజీఓ టవర్స్ పరిశుభ్రతలో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులను అభినందించి గ్లౌవ్స్, శానిటేషన్ కిట్లు అందజేశారు.అనంతరం ‘ఏక్ పేడ్ మా కే నామ్’లో భాగంగా సీజీఓ టవర్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి