‘స్వచ్ఛత హీ సేవా’ కార్యక్రమంలో మెరిసిన పారిశుధ్య యోధులు
ఆరోగ్య భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతే తమ మున్సిపాలిటీ ప్రథమ ప్రాధాన్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. "స్వచ్ఛత హీ సేవా" కార్యక్రమంలో భాగంగా బుధవారం పురపాలక సంఘం పరిధిలో పారిశుధ్య కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం, సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, వారికి ఆర్థిక భద్రత కల్పించే పిఎంజెజెబై (PMJJBY), పిఎంఎస్‌బివై (PMSBY) వంటి కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలపై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం పట్టణ పరిశుభ్రతలో పగలు, రాత్రి తేడా లేక శ్రమిస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, స్వచ్ఛ ఆటో సారథులు, వేస్ట్ పిక్కర్లు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్లను చైర్‌పర్సన్ శాలువాలతో ఘనంగా సన్మానించి, వారి భద్రత కోసం PPE (పిపిఇ) సేఫ్టీ కిట్లను అందజేశారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ— "మన పట్టణాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు, వేస్ట్ పిక్కర్లు, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ల పాత్ర అత్యంత విలువైంది. మీ సేవలు సమాజానికి ఆదర్శనీయం. విధి నిర్వహణలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా PPE సేఫ్టీ కిట్లను ధరించాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత వైద్యం, బీమా సౌకర్యాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి" అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, కౌన్సిలర్ హన్ను మహమ్మద్, స్థానిక నాయకులు బత్తుల దాసు, దేప రాజు, వైద్యులు డాక్టర్ జయంత్ కుమార్, డాక్టర్ సౌజన్య, సిహెచ్‌ఓ కృష్ణ కుమార్, హెచ్‌ఈ సాయి రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్‌ఓ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్, కార్యాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి