సినీ నటి నిధి అగర్వాల్ చేతుల మీదుగా ఘనంగా శుభారంభం
కుటుంబంలోని అన్ని తరాల అభిరుచులకు అనుగుణంగా వస్త్ర విభాగాలు
సైదాబాద్,
వస్త్ర ప్రపంచంలో విశ్వసనీయతకు, నాణ్యతకు మారుపేరుగా నిలిచిన ఆర్.ఎస్.బ్రదర్స్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. సంస్థ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని సైదాబాద్, సంతోష్‌నగర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 20వ మెగా షోరూమ్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు, వస్త్రప్రియులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ..విశ్వసనీయత, సంప్రదాయ విలువలు, ఆధునిక ఫ్యాషన్ల సమ్మేళనంగా ఆర్.ఎస్.బ్రదర్స్ నిలుస్తోందన్నారు. అన్ని వర్గాల వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను అందుబాటులో ఉంచడం అభినందనీయమని పేర్కొన్నారు.దశాబ్దాలుగా వినియోగదారుల ఆదరాభిమానాలతో అంచెలంచెలుగా ఎదిగిన ఆర్.ఎస్.బ్రదర్స్ సంస్థను పి. వెంకటేశ్వర్లు, ఎస్. రాజమౌళి, టి. ప్రసాదరావు, స్వర్గీయ పి. సత్యనారాయణ స్థాపించారు. నాణ్యత, నమ్మకం, వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ వస్త్ర రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకుంది.వినియోగదారుల ఆదరణే బలం: వెంకటేశ్వర్లు
సంస్థ ఫౌండర్, ఛైర్‌పర్సన్ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వినియోగదారుల ఆశీస్సులతో 20వ షోరూమ్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.సైదాబాద్, పరిసర ప్రాంతాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన, వైవిధ్యభరితమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో ఒకే చోట అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.వినూత్న షాపింగ్ అనుభూతి: రాజమౌళి*
ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. రాజమౌళి మాట్లాడుతూ..సంతోష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మెగా షోరూమ్ వినియోగదారులకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.అన్ని వయసుల వారికి నచ్చే విభిన్న డిజైన్లు, ఆధునిక ఫ్యాషన్లు అందుబాటులో ఉంటాయని వివరించారు.*ప్రాంతీయ అభిరుచులకు ప్రాధాన్యం: ప్రసాదరావు*
ఫౌండర్, హోల్‌టైమ్ డైరెక్టర్ టి. ప్రసాదరావు మాట్లాడుతూ.. సైదాబాద్ ప్రాంత ప్రజల అభిరుచులు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని షోరూమ్‌ను విస్తరించినట్లు తెలిపారు. స్థానిక కుటుంబాలు తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు.*దసరా, పెళ్లిళ్ల సీజన్‌కు ప్రత్యేక కలెక్షన్లు*
దసరా నవరాత్రులు, రాబోయే వివాహ వేడుకలను దృష్టిలో ఉంచుకుని మహిళల కోసం కంచి పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు, ప్రత్యేక నేత వస్త్రాలు, పెళ్లి కుమార్తెల కోసం సంప్రదాయ డిజైన్లను అందుబాటులో ఉంచారు. పురుషుల కోసం డిజైనర్ కుర్తాలు, ఎత్నిక్ వేర్, ఫార్మల్ సూట్స్, కాజువల్ దుస్తులు, చిన్నారుల కోసం ఆకర్షణీయమైన ఫెస్టివల్ కలెక్షన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.సైదాబాద్, సంతోష్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల వస్త్ర ప్రియులు నూతన షోరూమ్‌ను సందర్శించి షాపింగ్ అనుభూతిని పొందాలని యాజమాన్యం కోరారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి