Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అద్దె వాహనాల సొమ్ముపై అధికారుల కన్ను? నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 10:08 PM

రూ.50 లక్షలతో నిర్మించిన గొర్రెల మార్కెట్ యార్డును వెంటనే ప్రారంభించాలి

24-09-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్‌కు టీజీ ఎంపిఎస్ వినతి

పట్టణ కేంద్రంలో రూ.50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన గొర్రెల మార్కెట్ యార్డును తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (టీజీ ఎంపీఎస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

స్థానిక వృత్తిదారుల కార్యాలయంలో గుణముని ఐలయ్య అధ్యక్షతన మండల కమిటీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్ డైరెక్టర్ బండారు నరసింహ, టీజీ ఎంపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండే శ్రీశైలం పాల్గొని మాట్లాడారు. మార్కెట్ యార్డును పూర్తి చేసినా ఇప్పటికీ వినియోగంలోకి తేకపోవడం దారుణమన్నారు. యార్డులోని మంచినీటి బోరు మోటారు, జీవాల కోసం నిర్మించిన నల్లాలను ధ్వంసం చేసి దొంగిలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.​సమస్యలు పరిష్కరించాలి.. జీవాలకు సకాలంలో నట్టల నివారణ మందులు పంపిణీ చేయడంతో పాటు మందల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలోనూ మూగజీవాలకు నీటి తొట్లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి పెంపకందారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.​ఈ కార్యక్రమంలో మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి, టీజీ ఎంపీఎస్ మండల అధ్యక్షుడు భీమనగని బాలరాజ్, మున్సిపల్ కన్వీనర్ గుణమోని ఐలయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు నారీ వెంకటేశం, నాయకులు గజ్జి పాండు, గడగోటి జంగయ్య, జెనిగల యాదయ్య, అరిగే బీరప్ప, గాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రూ.50 లక్షలతో నిర్మించిన గొర్రెల మార్కెట్ యార్డును వెంటనే ప్రారంభించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News