రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంతో పాటు యోగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ నుస్రత్ మాట్లాడుతూ.. ఆయుర్వేదం మన ప్రాచీన సంపద అని పేర్కొన్నారు. ఆయుర్వేదం, యోగాను రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించవచ్చని వివరించారు. ఆయుర్వేద మందులు ప్రకృతి సిద్ధంగా తయారవుతాయని తెలిపారు.
యోగా ఇన్‌స్ట్రక్టర్ సైదులు యోగాసనాలు, ప్రాణాయామం ప్రాముఖ్యతను వివరించడంతో పాటు పలు ఆసనాలను ప్రదర్శించి చూపించారు. కార్యక్రమంలో ఎస్‌ఎన్‌ఓ ప్రవీణ్, వైద్యశాల సిబ్బంది, పలువురు రోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి