Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అదుపుతప్పి బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 01:21 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

30-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డి.. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి

సూర్యాపేట తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డిని, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం రాత్రి అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. సామ రామ్మోహన్‌రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్‌ చైర్మన్‌గా, ముఖ్య అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందినవారు కాగా, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు. యూత్‌ కాంగ్రెస్‌లో పలు హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నారు.

Sthanikam

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News