Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:26 AM

ప్రపంచ గిన్నిస్ రికార్డు సాధించిన పల్లివాడ విద్యార్థి

01-06-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన బాదే జోసఫ్ ప్రిన్స్ ప్రపంచ గిన్నిస్ రికార్డు సాధించి గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఆడిటోరియంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “గిన్నిస్ అచీవర్స్ మీట్” కార్యక్రమంలో ప్రపంచంలోని 22 దేశాలకు చెందిన సుమారు 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొన్నారు. గంటల తరబడి నిరంతరాయంగా కీబోర్డ్ వాయిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించిన వారిలో ఎంపికైన 777 మంది విద్యార్థులకు వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా హల్లెల్ మ్యూజిక్ స్కూల్ చైర్మన్ అగస్టీన్ దాదంగి జోసఫ్ ప్రిన్స్‌కు స్వయంగా సర్టిఫికెట్ అందజేసి అభినందించారు.

జోసఫ్ ప్రిన్స్ సాధించిన విజయంపై లైఫ్ ఎడిఫైర్స్ చర్చి వ్యవస్థాపకులు జోనాతన్, సంఘ సభ్యులు, తల్లిదండ్రులు బాదే విజయ్–లీల హర్షం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దలు బాదే శ్రీనివాస్, ధనమ్మ, అక్క బాదే దీక్షిత, అన్న బాదే అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.

లండన్ నుంచి వచ్చిన అక్క దీక్షిత తన తమ్ముడు పోటీల్లో ప్రదర్శించిన ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించి ఆనందం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రపంచ రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జోసఫ్ ప్రిన్స్ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు, సంఘ కాపరి జోనాతన్ చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచి ప్రోత్సహించారని, వారి సహకారంతోనే ఈ ఘనత సాధించగలిగానని తెలిపారు

Sthanikam

ప్రపంచ గిన్నిస్ రికార్డు సాధించిన పల్లివాడ విద్యార్థి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News