చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గోలి విజయలక్ష్మి, ఉంగరాల కిరణ్‌కుమార్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు.
మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారిని శాలువాలతో సత్కరించి, మెమొంటోలు అందజేశారు.
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు గోలి నరేష్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి