11 రోజుల పూజల అనంతరం గణనాధునికి ఘన వీడ్కోలు.
దాతలను సన్మానించిన గల్లీ యూత్ సభ్యులు
రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో గల్లి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని ఆటపాటల మధ్య గ్రామంలో ఊరేగించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం నిర్వహించారు.ఈ సందర్భంగా గణనాధుడి లడ్డును గోగు సత్తయ్య రూ.21 వేలకు కైవసం చేసుకున్నారు.
స్వామివారి పండ్లు, పంచలను బోనగిరి సత్తయ్య రూ.3 వేలకు దక్కించుకున్నారు. విగ్రహ దాత డాక్టర్ కొండ మల్లేశం గౌడ్, డీజే సౌండ్ బాక్స్ దాత కొండ వెంకటేశం గౌడ్, లడ్డు దాత ఆగు లింగస్వామి దంపతులను గల్లి యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం భక్తులు స్వామివారికి హారతులు ఇచ్చి, భజనలు, ఆటపాటలతో నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో గ్రామ యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి