నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రి అజారుద్దీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి పనులపై చర్చించారు. గతంలో ఎమ్మెల్యే చేసిన విజ్ఞప్తి మేరకు నారాయణఖేడ్ మున్సిపాలిటీలో షాదీఖానా నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు, మైనార్టీ మహిళల స్వయం ఉపాధి కోసం 200 కుట్టు మిషన్లు మంజూరు చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద మైనార్టీ మహిళలు, యువతులకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అదనంగా మరో 500 కుట్టు మిషన్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే అదనపు కుట్టు మిషన్ల మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, నారాయణఖేడ్ నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
నారాయణఖేడ్ మైనార్టీ మహిళలకు అదనంగా 500 కుట్టు మిషన్లు కోరిన ఎమ్మెల్యే

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి