విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట లైబ్రేరియన్ డాక్టర్ రాచమల్ల శ్రీనుకు ‘ఇన్నోవేటివ్ లైబ్రేరియన్ అవార్డు–2026’ దక్కింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్లయర్స్ చారిటబుల్ ట్రస్ట్, ఏసీటీ అకాడమీ ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
2020లో ప్రారంభించిన knowledgehubknmgdc.blogspot.com ద్వారా విద్య, ఉపాధి, వినోదానికి సంబంధించిన సమాచారాన్ని ఒకే వేదికపై అందిస్తున్నారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీ, స్వయం ప్రభ, ఈ–పీజీ పాఠశాల, విద్యామిత్ర, టీఎస్‌ఏటీ, స్వయం, సాథీ తదితర విద్యా వేదికలతో పాటు పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్, ఆన్‌లైన్ కోర్సులు, ఉద్యోగ నోటిఫికేషన్లు, వివిధ పత్రికల లింకులను అందుబాటులో ఉంచారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆడియో, వీడియో పాఠాలతో పాటు అంతర్జాతీయ రేడియో, టీవీ, వార్తాపత్రికల సమాచారాన్ని సైతం బ్లాగ్‌లో పొందుపరిచారు. డిజిటల్ సమాచారాన్ని అందరికీ చేరువ చేస్తున్న శ్రీనుకు ఈ అవార్డు లభించడం పట్ల కళాశాల వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి