Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:19 AM

నల్లగొండ గొల్లగూడ PACS చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

05-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణ కేంద్రంలోని గొల్లగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్‌గా ఆలకుంట్ల నాగరత్నం రాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన పదవిలోకి ప్రవేశించారు.

ఈ సందర్భంగా నాగరత్నం రాజు మాట్లాడుతూ, గొల్లగూడ PACS ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించడంతో పాటు, సకాలంలో రుణాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, వారి సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. అలాగే, సొసైటీ అభివృద్ధికి కృషి చేసి, రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేలా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది, అభిమానులు చైర్మన్‌ను పూలమాలలు, బోకేలు, శాలువాలతో సన్మానించారు.

కాగా, PACS చైర్మన్ల పదవీకాలం గతంలో ముగిసిన నేపథ్యంలో, ప్రభుత్వం మరోసారి వారి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Sthanikam

నల్లగొండ గొల్లగూడ PACS చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News