మానూర్ మండల పరిధిలోని తోర్నాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన లక్ష్మీ గణేష్ మండపం వద్ద మంగళవారం గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా లక్ష్మీ గణేష్ మండపం వద్ద ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించారు. నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం అందజేసి, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై లక్ష్మీ గణేష్ విగ్రహాన్ని గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. భాజా భజంత్రీల నడుమ యువకులు చేసిన నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్‌తో పాటు మల్లికార్జున్ పాటిల్, చంద్రశేఖర్ పాటిల్, రాహుల్ పాటిల్, సంజు కుమార్, జగన్నాథ్, కుశప్ప, శ్రీపాల్, సంతు స్వామి, గులాబ్ ఖాన్, గణేష్, సంఘయ్య స్వామి తదితరులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
లక్ష్మీ గణేష్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి