Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

లక్కారం మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

06-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక – ప్రతి గ్రూపుకు 40 సీట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న లక్కారం ఆదర్శ కళాశాల / మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శివ స్వరూప రాణి తెలిపారు. కళాశాలలో MPC, BiPC, CEC, MEC, ACE గ్రూపులు అందుబాటులో ఉండగా, ప్రతి గ్రూపులో 40 సీట్లు ఉన్నాయి. పదో తరగతి ఫలితాల్లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితమని వెల్లడించారు.2026 మార్చిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. ఆసక్తి గల వారు తమ పదో తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం జిరాక్స్‌లతో కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అలాగే https://tgms.telangana.gov.in⁠� వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుల చివరి తేది మే 20, 2026 కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. మరిన్ని వివరాలకు 8099229637 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Sthanikam

లక్కారం మోడల్ స్కూల్‌లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News