Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 06:55 PM

కెమికల్ పరిశ్రమలను వెంటనే మూసివేయాలి చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముట్టడి..

01-10-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సీపీఎం మహాధర్నా.. 11 కి.మీ. పాదయాత్ర

నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి: ఎం.డి. జహంగీర్

పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రసాయన పరిశ్రమలను తక్షణమే మూసివేయాలని, కాలుష్యం వల్ల నష్టపోయిన రైతాంగానికి తగిన పరిహారం చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. జహంగీర్ డిమాండ్ చేశారు. కాలుష్య పరిశ్రమలను తరలించాలని కోరుతూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం అంతమ్మగూడెం నుంచి చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం వరకు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.​పరిశ్రమల నుంచి వెలువడుతున్న ప్రమాదకర రసాయన వ్యర్థాలు, పొగ వల్ల నీరు, వాయువు తీవ్రంగా కాలుష్యమవుతున్నాయని జహంగీర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సి.పీ.సి.బి.) కూడా గాలిలో 12 రకాల ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించిందని, ఈ కాలుష్యం వల్ల స్థానికులు క్యాన్సర్, నాడీ వ్యవస్థ వైకల్యం, కిడ్నీ సమస్యల బారిన పడుతున్నారని మండిపడ్డారు. పండించిన పంటలు విషతుల్యమై వ్యవసాయం, పశుపోషణ దెబ్బతింటున్నాయని తెలిపారు. 2019 కమిటీ సూచనల ప్రకారం ఎకరానికి రూ.52,000 చొప్పున పరిహారం అందించాలని, కలెక్టరేట్‌లో జమ చేసిన రూ.23 లక్షల పంట నష్టపరిహారాన్ని వెంటనే పంపిణీ చేయాలన్నారు. పరిహారం అంచనా వేసే కమిటీల్లో స్థానిక రైతులకు అవకాశం కల్పిస్తూ రీ-సర్వే చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ​సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ మాట్లాడుతూ.. నియమాలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ప్రత్యేక వైద్య శిబిరాలు, ఉపాధి సహాయం అందించాలని కోరారు. ధర్నా అనంతరం నాయకులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆర్డీవో.. 15 రోజుల్లోగా రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని, రీ-సర్వేతో పాటు ఇతర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ప్రసాదం విష్ణు, బూరుగు కృష్ణారెడ్డి, గూడూరు అంజిరెడ్డి, కోట రామచంద్రారెడ్డి, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్, ఎండి పాషా, గడ్డం వెంకటేష్, నర్సింహ్మ, పొట్ట శ్రీనివాస్, సామ జంగారెడ్డి అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

కెమికల్ పరిశ్రమలను వెంటనే మూసివేయాలి చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముట్టడి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News