Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా జీఎంఆర్ ఫౌండేషన్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 10:29 PM

క్షయ వ్యాధిపై అప్రమత్తత అవసరం.. రాసోల్‌లో అవగాహన కార్యక్రమం

01-10-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో క్షయ వ్యాధి (టీబీ)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స, నివారణ చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో టీబీ సూపర్‌వైజర్ ప్రకాష్, ఎం.పీ.హెచ్. నారాయణరెడ్డి, ఎం.ఎల్.హెచ్.పీ శిల్ప, ఎం.పీ.హెచ్.డబ్ల్యూ రుతు, పీ.పీ.హెచ్.ఎన్ మార్తమ్మ, ఏఎన్‌ఎం, ఆశా సిబ్బంది సుజాత, ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్షయ వ్యాధిపై అప్రమత్తత అవసరం.. రాసోల్‌లో అవగాహన కార్యక్రమం

Article Image

కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో క్షయ వ్యాధి (టీబీ)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స, నివారణ చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రివేళ చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో టీబీ సూపర్‌వైజర్ ప్రకాష్, ఎం.పీ.హెచ్. నారాయణరెడ్డి, ఎం.ఎల్.హెచ్.పీ శిల్ప, ఎం.పీ.హెచ్.డబ్ల్యూ రుతు, పీ.పీ.హెచ్.ఎన్ మార్తమ్మ, ఏఎన్‌ఎం, ఆశా సిబ్బంది సుజాత, ఆసుపత్రి సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News