Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

కాలువ పనులకు శ్రీకారం. ఉపాధి హామీ కింద ధర్మారెడ్డి పెళ్లి ఫీడర్ ఛానల్ పూడికతీత ప్రారంభం.

08-06-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద ధర్మారెడ్డి పెళ్లి ఫీడర్ ఛానల్ వరద కాలువ పూడికతీత, మరమ్మత్తు పనులను గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. రానున్న వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు, వ్యవసాయ భూములకు నీటి పారుదల సౌకర్యం మెరుగుపడేలా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో కాలువల పునరుద్ధరణ కీలకమని, ఈ పనుల ద్వారా ఉపాధి హామీ కూలీలకు గ్రామంలోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కూలీలందరూ ప్రభుత్వ నిబంధనల మేరకు పనులకు హాజరై కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో అధికారులు, మేట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గాదే హేమలత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు కునూరు రాజుగౌడ్, కునూరు మహేష్‌గౌడ్, మేడి కృష్ణ, కొక్కుల శంకర్, ఉపాధి హామీ మేట్లు కునూరు సరిత, గోగు లలితతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

కాలువ పనులకు శ్రీకారం. ఉపాధి హామీ కింద ధర్మారెడ్డి పెళ్లి ఫీడర్ ఛానల్ పూడికతీత ప్రారంభం.

Article Image

రామన్నపేట

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద ధర్మారెడ్డి పెళ్లి ఫీడర్ ఛానల్ వరద కాలువ పూడికతీత, మరమ్మత్తు పనులను గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. రానున్న వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ఉండేందుకు, వ్యవసాయ భూములకు నీటి పారుదల సౌకర్యం మెరుగుపడేలా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో కాలువల పునరుద్ధరణ కీలకమని, ఈ పనుల ద్వారా ఉపాధి హామీ కూలీలకు గ్రామంలోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కూలీలందరూ ప్రభుత్వ నిబంధనల మేరకు పనులకు హాజరై కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో అధికారులు, మేట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధ, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గాదే హేమలత, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు కునూరు రాజుగౌడ్, కునూరు మహేష్‌గౌడ్, మేడి కృష్ణ, కొక్కుల శంకర్, ఉపాధి హామీ మేట్లు కునూరు సరిత, గోగు లలితతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News