Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి : పచ్చిపాల రామకృష్ణ యాదవ్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 06:28 AM

కళ్లలో కారం చల్లి.. రాళ్లతో దాడి. నల్గొండలో వ్యక్తి దారుణ హత్య.

02-10-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: పట్టణంలోని గంధంవారిగూడెంలో గురువారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. బంటు వెంకటేష్‌ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో మృతిచెందినట్లు సమాచారం.

రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్య ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు వెంకటేష్‌పై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందుగా ఆయన కళ్లలో కారం చల్లి.. అనంతరం రాళ్లు, బండరాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది.

మృతుడికి భార్యతో కొంతకాలంగా గొడవలు ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కూడా పాల్గొన్నట్లు వెంకటేష్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై పోలీసుల నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు కుటుంబ వివాదాలా.. పాత కక్షలా.. మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వివరాలు, హత్యకు అసలు కారణం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Sthanikam

కళ్లలో కారం చల్లి.. రాళ్లతో దాడి. నల్గొండలో వ్యక్తి దారుణ హత్య.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News