Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

హరీశ్ రావు జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పాటల సీడీ ఆవిష్కరణ

Updated : 02 Jun 2026 20:42 IST
As Preferred Source 1 min read
హరీశ్ రావు జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పాటల సీడీ ఆవిష్కరణ

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యువ నాయకుడు వికాస్ రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని మాజీ మంత్రి హరీశ్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు హరీశ్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా హరీశ్ రావు ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆయన నాయకత్వం తెలంగాణకు ఎంతో అవసరమని తెలిపారు. యువ నాయకుడు వికాస్ రూపొందించిన ఈ పాటలు హరీశ్ రావు ప్రజాసేవ, నాయకత్వ లక్షణాలు, తెలంగాణ పట్ల ఆయన అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు ఆయన మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Sthanikam

హరీశ్ రావు జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పాటల సీడీ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి