చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం అందజేసిన షూస్‌ను గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీ ప్రసన్న నరసింహ గౌడ్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి, గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆకుల కృష్ణ, వార్డు సభ్యులు కురుమతి బిక్షం, రత్నం, నాగరాజు, బస్సు వరప్రసాద్, బొడిగే ప్రభాకర్, కురుమతి లింగస్వామి, పాఠశాల చైర్మన్ గాదె వినోద, ప్రధానోపాధ్యాయురాలు హేమలత, మల్లికార్జున్, అహల్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి