Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:52 AM

ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు

07-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్లూసికేఫ్ వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీ డబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర వ్వవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు నాయకులు పాల్లొని బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుల శ్రేయస్సు, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన జర్నలిస్టు పక్షపాతి నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు,అపరచానిక్యుడు, రాష్ట్ర జర్నలిస్టులందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రతినిత్యం జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్న మామిడి సోమయ్య కు అభినందనలని అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం సంతోష కరమని అన్నారు. మామిడి సోమయ్య ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి నందిపాటి సైదులు, ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిగుంట్ల గోవర్ధన్ గౌడ్, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గుడపూరి ప్రభు, యూనియన్ నాయకులు ఎస్ ఎన్ 9 న్యూస్ ఛానల్ అధినేత చాంద్ పాషా, ఎస్. అనిల్ కుమార్, పాల్వాయి గౌతమ్, స్నేహితులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ నేత మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News