ఆదోని, : రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అరేకల్లు రామకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు కేక్ కట్ చేయించి, పూలమాల వేసి, శాలువాతో సత్కరించి అరేకల్లు రామకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ అరేకల్లు రామకృష్ణ ప్రజాసేవలో విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి