Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాసం వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:57 PM

గ్రామాల్లో బెల్టు షాపులను స్వచ్ఛందంగా మూసివేయాలి: పీపల్ పహాడ్ ఉపసర్పంచ్ శ్రవణ్ గౌడ్

02-06-2026 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామాల్లో అక్రమంగా కొనసాగుతున్న బెల్టు షాపులను నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేయాలని పీపల్ పహాడ్ ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్టు షాపుల నిర్వహణ వల్ల నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబాలు విచ్ఛిన్నం.. యువత పెడదోవ..

ఇంటి ముందే మద్యం సులువుగా దొరుకుతుండటంతో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు మద్యానికి బానిసలవుతున్నారని, ఫలితంగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని శ్రవణ్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామంలోని యువత మద్యం మత్తుకు అలవాటు పడుతోందని.. బెల్టు షాపులను తక్షణమే నివారించకపోతే భవిష్యత్తు తరాలు పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.​"గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్న బెల్టు షాపులను వెంటనే అరికట్టాలి. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు స్వచ్ఛందంగా వీటిని మూసివేయాలి."​గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు కూడా దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Sthanikam

గ్రామాల్లో బెల్టు షాపులను స్వచ్ఛందంగా మూసివేయాలి: పీపల్ పహాడ్ ఉపసర్పంచ్ శ్రవణ్ గౌడ్

Article Image

గ్రామాల్లో అక్రమంగా కొనసాగుతున్న బెల్టు షాపులను నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేయాలని పీపల్ పహాడ్ ఉపసర్పంచ్ బకనగారి శ్రవణ్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాల్లో బెల్టు షాపుల నిర్వహణ వల్ల నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబాలు విచ్ఛిన్నం.. యువత పెడదోవ..

ఇంటి ముందే మద్యం సులువుగా దొరుకుతుండటంతో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు మద్యానికి బానిసలవుతున్నారని, ఫలితంగా ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని శ్రవణ్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే గ్రామంలోని యువత మద్యం మత్తుకు అలవాటు పడుతోందని.. బెల్టు షాపులను తక్షణమే నివారించకపోతే భవిష్యత్తు తరాలు పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.​"గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, నిరుపేదల జీవితాలతో ఆడుకుంటున్న బెల్టు షాపులను వెంటనే అరికట్టాలి. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు స్వచ్ఛందంగా వీటిని మూసివేయాలి."​గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు కూడా దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News