హైదరాబాద్, అక్టోబర్ 1: సత్యం, అహింస అనే సిద్ధాంతాలతో ప్రపంచ చరిత్రను మార్చిన మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే. రాజ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నేటి అశాంతి సమాజానికి గాంధీజీ చూపిన శాంతి మార్గమే పరిష్కారమని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని క్షేత్రస్థాయిలో సాకారం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతి, గ్రామీణ వికాసానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. మాటల్లో కాకుండా చేతల్లో గాంధీజీ ఆశయాలను అమలు చేస్తూ సమాజ మార్పు, దేశ సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి