గడ్డిఅన్నారం:
మహాత్మాగాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని గడ్డిఅన్నారం డివిజన్ మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గడ్డిఅన్నారం డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీజీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డివిజన్‌లోని గాంధీ విగ్రహానికి భవానీ ప్రవీణ్‌కుమార్ పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ సత్యం, అహింసా మార్గాల్లో నడిచి దేశ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్, ముఖ్య నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి