Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్ర పూజలో పాల్గొన్న హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 08:39 PM

ఎస్సీ కమిషన్‌లో మాదిగ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలి.

02-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తిరుమలగిరి; ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల్లో రొటేషన్ పద్ధతిని అవలంబించి మాదిగ, ఉపకులాలకు చెందిన అర్హులైన జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టీఎంజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం తిరుమలగిరిలోని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ క్యాంపు కార్యాలయంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టీఎంజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో జర్నలిస్టు రంగానికి చెందిన అర్హులకు చైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటివరకు రాజకీయ కోణంలో జరిగిన ఎంపికలకు భిన్నంగా రొటేషన్ పద్ధతిని అమలు చేసి వివిధ సామాజిక వర్గాలకు, ముఖ్యంగా మాదిగ, ఉపకులాల జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశాన్ని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

కార్యక్రమంలో టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ సలహాదారు జిలకర కృష్ణాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియం నాగయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి చింత ప్రవీణ్ పాల్గొన్నారు.

Sthanikam

ఎస్సీ కమిషన్‌లో మాదిగ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News