ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ గా మేళ్లచెరువు ముక్కంటి మాదిగ నియమితులయ్యారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆదేశాల మేరకు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్ ఆవరణలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ అధ్యక్షతన శనివారం ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కేదాసి మోహన్ మాదిగ పాల్గొని సూర్యాపేట జిల్లా ఇంచార్జీ గా మేళ్లచెరువు ముక్కంటి మాదిగకు బాధ్యతలు అప్పగించిట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన పల్లేటి లక్ష్మణ్ మాదిగకు ఎమ్మార్పీఎస్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రెండు నెలల్లో జిల్లా, మండల, గ్రామ నిర్మాణ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసినజాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగకు,ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు కనుక జానయ్య మాదిగ. జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి కంటి అంబేద్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి విజయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు చింతా సైదులు, గూడపూరి ఉపేందర్, మిద్దె వెంకన్న, కడప పెంటయ్య, బచ్చలకూరి నాగరాజు, పాల్వాయి సూరయ్య, కందుకూరి నాగేశ్వరరావు, బోలెపొంగు స్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి