Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్వచ్ఛ భారత్ స్ఫూర్తి: పారిశుధ్య కార్మికులకు బిగ్ ఆఫర్! ఆరోగ్య పరీక్షలు, ఉచిత ఇన్సూరెన్స్.. PPE కిట్లతో ఘన సన్మానం నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 30, 2026 08:09 PM

ఈఎంఐల భయంతో రాక్షసత్వం: కంటికి రెప్పలా చూడాల్సిన అమ్మమ్మనే బలితీసుకున్నాడు!

30-09-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేసును ఛేదించిన చౌటుప్పల్ పోలీసులు.. నిందితుడు జుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

అప్పులు తీర్చడం కోసం, ఇన్‌స్టాల్‌మెంట్లు (EMIలు) కట్టలేక ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. వరుసకు అమ్మమ్మ అయ్యే వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి, ఆమె వద్దనున్న పసిడి, వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను చౌటుప్పల్ ఇన్ స్పెక్టర్ జి. మన్మధ కుమార్ వెల్లడించారు. తూప్రాన్‌పేట్ గ్రామానికి చెందిన మంటిపల్లి యాదమ్మ (70) అనే వృద్ధురాలు ఈ నెల 27న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై ఆమె మేనల్లుడు మంటిపల్లి దర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు BNSS సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు (క్రైమ్ నెం. 538/2026) నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, శరీరముపై ఉన్న గాయాల ఆధారంగా అది హత్యగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులను (CDR) విశ్లేషించి, తూప్రాన్‌పేట్ బ్యాంక్ కాలనీకి చెందిన పాల వ్యాపారి మంటిపల్లి రాజు (31)పై అనుమానంతో బుధవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో నిందితుడు రాజు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, ఈఎంఐలు చెల్లించలేక డబ్బు కోసం వరుసకు అమ్మమ్మ అయ్యే యాదమ్మను హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను దొంగిలించినట్లు వెల్లడించాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు:

బంగారం సుమారు 3 తులాల పొడవాటి గొలుసు, 1.5 తులాల గొలుసు, 5 గ్రాముల చెవి దుద్దులు, 4 గ్రాముల మాటీలు. ​వెండి ఆభరణాలు సుమారు 90 తులాల కాలి కడియాలు, 40 తులాల సలాం కడియాలు, 29 తులాల కాలి గొలుసులు. VIVO Y20G స్మార్ట్ ఫోన్, ప్యాషన్ ప్లస్ బైక్ (TG 30 B 4845).

​ఈ కేసును త్వరితగతిన ఛేదించిన చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్లు పి. రవీందర్, సతీష్ (రామన్నపేట), సిబ్బంది నర్సిరెడ్డి, సందీప్, భరద్వాజ్, ప్రవీణ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

Sthanikam

ఈఎంఐల భయంతో రాక్షసత్వం: కంటికి రెప్పలా చూడాల్సిన అమ్మమ్మనే బలితీసుకున్నాడు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News