పంతంగి, లింగోజగూడెం జైకేసారం లలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం
శ్రీ హనుమాన్ ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో శ్రీకారం
చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి, లింగోజిగూడెం, జై కేసారం గ్రామాలలో శ్రీ హనుమాన్ ఎఫ్ పిఓ మాక్స్ పంతంగి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య, పిఏసిఎస్ ఛైర్మన్ ఈడుదుల మస్తాన్ బాబు యాదవ్, చౌటుప్పల్ ఎంఆర్ఓ విరబాయ్, ఆర్ ఐ లు హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ధాన్యంలో తాలు, రాళ్లు, మట్టి పెళ్లలు లేకుండా బాగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, పిఏసిఎస్ వైస్ ఛైర్మన్ పర్నె శివారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచులు కాకి లలిత సుందర్, సమిరెడ్డి భారతమ్మ, ఉప సర్పంచులు సదానంద్, బోదాస్ స్వాతి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బోయ దేవేందర్, బోయ రామచందర్, పంతంగి కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల అధ్యక్షులు, గ్రామాల వార్డు మెంబర్లు, రైతులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి