హయత్ నగర్; అక్టోబర్, 2
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హయత్ నగర్ డివిజన్‌లోని P&T కాలనీ, లక్ష్మీప్రియా కాలనీ, అయోధ్య నగర్ కాలనీల ఆధ్వర్యంలో, నీలచల యూత్ అసోసియేషన్ వారు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల అమ్మవారి మండపం కర్ర పూజ కార్యక్రమంలో హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ ధర్మం, ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి మరియు మన పండుగల విశిష్టతను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ మన పండుగలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించాలని అన్నారు.మన సంస్కృతి, సంప్రదాయాలు కేవలం పండుగలకే పరిమితం కాకుండా మన జీవన విధానంలో భాగంగా నిలిచి, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చేస్తున్న కృషిని అభినందించారు.అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆయా
కాలనీలా సంక్షేమ సంఘం సభ్యులు, నీలాచాల ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి