బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మునగాల మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.సాయంత్రం 5 గంటల తర్వాత మండలంలోని పలు గ్రామాల్లో చల్లటి ఈదురుగాలులు వీయడంతో పాటు మోస్తరు వర్షం కురిసింది.దీంతో రహదారులు తడిసిపోయి వాతావరణం చల్లబడింది. అప్పటివరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.వర్షం కారణంగా బయటకు వెళ్లిన వారు కొంత ఇబ్బందులు ఎదుర్కోగా,చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. మరోవైపు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో రైతులు పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు.
ద్రోణి ప్రభావంతో మునగాల మండలంలో మోస్తరు వర్షం.. చల్లబడిన వాతావరణం
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి