Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:54 PM

చిన్ననాటి మిత్రుడికి 'సోపతి' బాసట

చిన్ననాటి మిత్రుడికి 'సోపతి' బాసట

చిన్ననాటి మిత్రుడికి 'సోపతి' బాసట
05-05-2026 291 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ క్షతగాత్రుడికి రూ. 10 వేల ఆర్థిక సాయం

ఆదర్శంగా నిలిచిన 1990-91 ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు

ఆపదలో ఉన్న చిన్ననాటి మిత్రుడిని ఆదుకునేందుకు మేమున్నామంటూ చౌటుప్పల్ ప్రభుత్వ పాఠశాల 1990-91 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. తమతో పాటు కలిసి చదువుకున్న మిత్రుడు రామరాజు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారు.ప్రమాదం కారణంగా రామరాజు ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన విషయాన్ని గుర్తించిన మిత్రులంతా ఒకటయ్యారు. తమ 'పెద్దబడి సోపతిగాల' సహాయ నిధి నుండి రూ. 10,000/- నగదును మిత్రుడికి ఆర్థిక సాయంగా అందజేశారు. గాయాల నుండి కోలుకుంటున్న రామరాజును పరామర్శించి, ధైర్యం చెప్పారు. చిన్ననాటి మిత్రులందరూ కలిసికట్టుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిత్రుడికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చిన్ననాటి మిత్రుడికి 'సోపతి' బాసట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News