రాంనగర్‌లో విశేష పూజలు, ఘనంగా అన్నదానం
పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, సీఐ మన్మధ కుమార్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు, రాంనగర్ కాలనీలో 'రాంనగర్ యూత్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం 10వ రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని బుడ్డ కృష్ణ - గంగమ్మ దంపతుల కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, సీఐ మన్మధ కుమార్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం శ్రీనివాస్ థియేటర్ పక్కన, ఫైర్ స్టేషన్ సమీపంలోని 'గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్' లో బృహత్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాక చిరంజీవి, ఎండీ హన్ను, చెరుకు శివ, చింతల సాయిలు, కాలనీవాసులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొత్తోజు వెంకట చారి, కమిటి సభ్యులు, చౌటుప్పల్ పట్టణ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, గణేష్ మండపం వద్ద స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి