Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:56 PM

చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు

01-06-2026 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న రాజగోపాల్ రెడ్డి, లక్ష్మి దంపతులకు మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ దంపతులు ఘనస్వాగతం పలికారు.​అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేడుకల్లో రాజగోపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ దంపతులు, కౌన్సిలర్లు, నాయకులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని చౌటుప్పల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు దుస్తులను పంపిణీ చేశారు. నిరంతరం పట్టణ పరిశుభ్రత కోసం శ్రమించే కార్మికుల సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News