Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 26, 2026 06:35 PM

చలో ఢిల్లీని జయప్రదం చేయాలి. కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె. మల్లికార్జున్‌.

26-09-2026 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి టౌన్‌: కార్మిక సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె. మల్లికార్జున్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని, స్కీమ్‌ వర్కర్లను కార్మికులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు.

అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని, కార్మిక సంఘాల కార్యకలాపాలపై ఆంక్షలను ఎత్తివేయాలని, పెరుగుతున్న ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సహజ వనరులైన నీరు, భూమి, అడవులపై ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మికులు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకుని ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఆఫీస్‌ బేరర్లతో మల్లికార్జున్‌ వాలంటీర్‌గా పేరు నమోదు చేయించి ప్రతిజ్ఞ చేయించారు.

సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి పాండు, జిల్లా కోశాధికారి ఎండీ పాషా, జిల్లా ఆఫీస్‌ బేరర్లు మాయ కృష్ణ, దోనూరు నర్సిరెడ్డి, తుర్కపల్లి సురేందర్‌, గొరిగే సోములు, సుబ్బూరు సత్యనారాయణ, చెక్క రమేష్‌, నకిరేకంటి రాము, పొట్ట యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చలో ఢిల్లీని జయప్రదం చేయాలి. కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె. మల్లికార్జున్‌.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News