భారతీయ జనతా యువమోర్చాను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సభావత్ కుమార్ నాయక్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను పూర్తి అంకితభావంతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువతను పార్టీ సిద్ధాంతాల వైపు ప్రోత్సహిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. పార్టీ అభివృద్ధి, యువత సంక్షేమమే లక్ష్యంగా సీనియర్ నాయకుల మార్గదర్శకత్వంలో, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతానని వివరించారు.
నాయకులకు ధన్యవాదాలు:
తనకు ఈ బాధ్యతను అప్పగించినందుకు గాను భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా,అధ్యక్షులు, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా, యువమోర్చా అధ్యక్షులు శ్రీనాథ్, అలాగే పార్టీ నాయకులు, కుండే గణేష్, ఇతర నాయకులకు మరియు కార్యకర్తలకు సభావత్ కుమార్ నాయక్, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి