Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి. AILU రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌ డిమాండ్‌ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 28, 2026 04:56 PM

భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: జనసేన ఆముదాల పరమేశ్

28-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అమరవీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా చౌటుప్పల్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు, జనసైనికులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరించుకుంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.​ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుడు ఆముదాల పరమేశ్ మాట్లాడుతూ.. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నత విప్లవ యోధుడని కొనియాడారు. ఆయన ధైర్యం, త్యాగం, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆయన ఆలోచనలు, నిస్వార్థ సేవా భావాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రతి జనసైనికుడు ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తూ, సమాజ మార్పునకు కృషి చేస్తారని తెలిపారు.​ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పీక ప్రవీణ్, పెద్దగోని లింగస్వామి, కాసోజు గోపి, సంజయ్, పాశం శ్రీకాంత్, రమణ బాబు, గొడుగు గణేశ్, దొడ్డి వంశీ, నజీర్ పాషా, రామకృష్ణ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Sthanikam

భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: జనసేన ఆముదాల పరమేశ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News