Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

బీసీ బిడ్డల రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటే సహించం!

Updated : 27 Oct 2026 19:12 IST
As Preferred Source 1 min read
బీసీ బిడ్డల రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటే సహించం!

బీసీలు పాలనలోనూ భాగస్వాములు కావాలి: వీరమళ్ళ కార్తీక్ గౌడ్

ఈఎల్వీ భాస్కర్‌కు బీసీ యువజన సంఘం ఘన మద్దతు

బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ హెచ్చరించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సామాజిక వేత్త, సేవా నిర్వాహకుడు ఈఎల్వీ భాస్కర్‌కు బీసీ యువజన సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.​ఈ సందర్భంగా కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ... “ఈఎల్వీ భాస్కర్ తన సొంత ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సేవలు అందిస్తూ, సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. ఒక బీసీ బిడ్డ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటూ రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటే, కొందరు అనవసర విమర్శలు చేస్తూ అడ్డుపడాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ రాజకీయాల్లో పాల్గొనే హక్కు ఉంది. బీసీలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మిగిలిపోవాలా? ప్రజా నిర్ణయాల్లో, పాలనలో భాగస్వాములు కాకూడదా?” అని ఘాటుగా ప్రశ్నించారు. ఫౌండేషన్ సేవలను కేవలం రాజకీయ కోణంలోనే చూడటం సరికాదని, భాస్కర్ కార్యక్రమాల వల్ల ప్రజలకు జరుగుతున్న మేలును గుర్తించాలని కోరారు. సేవలు లేదా కార్యక్రమాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ప్రశ్నించవచ్చని, కానీ ఆత్మగౌరవంతో ఎదిగే బీసీ నాయకులపై బురదజల్లడం తగదన్నారు. బీసీ యువత కేవలం ఉద్యోగాలు, వ్యాపారాలకే కాకుండా రాజకీయ రంగంలోనూ లీడర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ​ఈఎల్వీ భాస్కర్ కి బీసీ యువజన సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బీసీల ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.​ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ, నియోజకవర్గ నాయకుడు సుర్వి శ్రీకాంత్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి కొత్త రాజు, నాయకులు యశ్వంత్, మణి, సాయిచరణ్, పండు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీ బిడ్డల రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటే సహించం!

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news