Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అడ్వకేట్ల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తా: చలకాని వెంకట్ యాదవ్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 27, 2026 09:02 AM

అడ్వకేట్ల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తా: చలకాని వెంకట్ యాదవ్

27-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన సందర్భంగా నకిరేకల్‌లో ఘన సన్మానం

తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన చలకాని వెంకట్ యాదవ్ శనివారం నకిరేకల్‌కు వచ్చిన సందర్భంగా న్యాయవాదులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా పుష్పగుచ్చాలతో, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ గొంతుక లేని వారికి తాను గొంతుకగా నిలుస్తానని, అడ్వకేట్ల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. సూర్యాపేట, నకిరేకల్, తదితర ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతాలకు చెందిన అడ్వకేట్లు అందించిన మద్దతు, ఆశీర్వాదాల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు.

తనకు లభించిన వైస్ చైర్మన్ పదవిని కేవలం ఒక హోదాగా కాకుండా, అడ్వకేట్లు తనపై ఉంచిన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. 24 గంటలూ అడ్వకేట్ల అభ్యున్నతి కోసం పనిచేస్తానని, ప్రతి అడ్వకేట్‌ను తన సోదరుడిగా భావించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

ఎన్నికల సమయంలో ఉన్న పోటీ ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రతి అడ్వకేట్ తనవాడేనని వెంకట్ యాదవ్ పేర్కొన్నారు. ఎవరు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని పక్కనపెట్టి ప్రతి అడ్వకేట్‌కు సమానంగా న్యాయం జరిగేలా పనిచేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం సన్మానం కోసం నకిరేకల్‌కు వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు అడ్వికేట్లతో పాటు సూర్యాపేట జిల్లా కోర్టు అడ్వకేట్ మాండ్ర మల్లయ్య యాదవ్‌తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అడ్వకేట్ల హక్కులు, సంక్షేమం కోసం పనిచేసే నాయకత్వంగా చలకాని వెంకట్ యాదవ్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం చలకాని వెంకట్ యాదవ్ గారు చేసిన కార్యక్రమాలు, అడ్వకేట్లకు అండగా నిలిచిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ వారి క్రియాశీలతను గుర్తు చేశారు.

Sthanikam

అడ్వకేట్ల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తా: చలకాని వెంకట్ యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News