Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:07 PM

అంబేద్కర్ భవనంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అంబేద్కర్ భవన్‌లో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవన్ ఇన్‌చార్జి భీమసేన జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల దశాబ్దాల ఆకాంక్షల ఫలితమని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు సామాజిక పురోగతి కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రగతి కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి. నారాయణ, సమ్సన్ సార్, రాజ్ కుమార్, పి. విట్టల్, బాలు యాదవ్, ప్రశాంత్ తదితరులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

Sthanikam

అంబేద్కర్ భవనంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News