Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో పెరుగనున్న ఆటో చార్జీలు భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 04:55 PM

20న మెడికల్ షాపుల బంద్

20న మెడికల్ షాపుల బంద్

20న మెడికల్ షాపుల బంద్
18-05-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Partha

రామన్నపేట : ఆన్‌లైన్‌లో మందుల విక్రయాల కారణంగా ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, ఫార్మా రంగంలో నెలకొన్న సమస్యలు, నకిలీ మందుల ప్రభావం, దేశవ్యాప్తంగా కెమిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం కోసం ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాపోలు రమేశ్ తెలిపారు.

సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవలకు సంబంధించిన మెడికల్ షాపులు మినహా మిగతా దుకాణాలు బంద్‌లో పాల్గొంటాయని చెప్పారు. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మెడికల్ సూపరింటెండెంట్, పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్, మండల తహశీల్దార్‌లకు ముందస్తుగా సమాచారం అందించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పోతరాజు శంకరయ్య, సభ్యులు నరసింహ, కరుణాకర్, సోమయ్య, రాయ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

20న మెడికల్ షాపుల బంద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News