Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీఎం సభ వేళ.. మాజీ ఎమ్మెల్యే హౌస్‌ అరెస్ట్‌ నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 01:29 PM

18 నుంచి యువజన వారోత్సవాలు. జిల్లా కలెక్టర్

16-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఈ నెల 18 నుంచి 23 వరకు యువజన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

18న “ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ” పేరుతో మండల స్థాయిలో మారథాన్ నిర్వహించనుండగా, జిల్లా స్థాయిలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఉదయం 6 గంటలకు రన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. 19న భువనగిరి ఏటీసీలో కెరీర్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ డే, 20న యాదగిరిగుట్ట ఎస్‌డీటీసీలో యువ నాయకత్వ సదస్సు, క్విజ్, పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

21న భువనగిరి ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు, 22న భువనగిరి కోట వద్ద క్లీన్ తెలంగాణ కార్యక్రమం చేపట్టనున్నారు. 23న కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ఉద్యోగ సాధన కార్యక్రమం నిర్వహించి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో యువత, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.

Sthanikam

18 నుంచి యువజన వారోత్సవాలు. జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News