Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:08 PM

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపులు

16-01-2026 299 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక దారి మళ్లింపులు

హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు

స్థానిక ప్రధాన ప్రతినిధి

సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకుని ఒకేసారి భారీగా వాహనాలు హైదరాబాద్ నగరానికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో, ట్రాఫిక్ రద్దీ నివారణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.హైదరాబాద్–విజయవాడ నేషనల్ హైవే–65పై చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రధాన రహదారులపై రద్దీ ఏర్పడకుండా ప్రయాణికులకు సురక్షితమైన, సాఫీ ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ట్రాఫిక్ దారి మళ్లింపులు అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు క్రింది సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దారి మళ్లింపు వివరాలు :

గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు

గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.

మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు

మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండమల్లేపల్లి → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.

నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు

నల్లగొండ → మార్రిగూడ బైపాస్ → మునుగోడు → నారాయణపూర్ → చౌటుప్పల్ (ఎన్‌హెచ్–65) మీదుగా హైదరాబాద్.విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు :

కోదాడ → హుజూర్నగర్ → మిర్యాలగూడ → హాలియా → చింతపల్లి → మాల్ మీదుగా హైదరాబాద్.

ఎన్‌హెచ్–65 (విజయవాడ–హైదరాబాద్) రహదారిపై చిట్యాల, పెద్దకాపర్తిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పక్షంలో :

చిట్యాల నుంచి భువనగిరి → చౌటుప్పల్ మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.

సంక్రాంతి రద్దీ సమయంలో ప్రయాణికులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.

Sthanikam

సంక్రాంతి రద్దీతో హైదరాబాద్ వెళ్లే వాహనాలకు ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News