Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:39 PM

పోలీస్ కంట్రోల్ రూమ్ పరిశీలించిన ఎస్పి..

16-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సిబ్బందిని సమన్వయం చేయడంలో పోలీస్ కంట్రోల్ రూమ్ విధులు ముఖ్యమైనదని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలియజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఉన్న పోలీస్ సెంట్రల్ కంట్రోల్ రూమ్, పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ల పనితీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డయల్ 100, పెట్రో కార్, నైట్ పెట్రోలింగ్, హైవే పెట్రోలింగ్, బ్లూ కోట్స్, బీట్ డ్యూటీలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. ఎక్కడ ప్రమాదాలు సంభవించిన సమస్యలు వచ్చిన నేరుగా అధిక సంఖ్యలో డయల్ 100 కు ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించి సిబ్బంది బాధితులకు పోలీస్ సేవలు అందించాలని ఆదేశించారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అనుమానిత కదలికలు గమనిస్తూ సంబంధిత పోలీసు వారికి సమాచారం అందించి నేరాల నివారణలో కృషి చేయాలని అన్నారు. ప్రతి అంశాన్ని సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని వేగంగా సేవలందించడం ద్వారా జిల్లా పోలీస్ శాఖకు గుర్తింపు వస్తుందని సూచించారు. జిల్లా పోలీస్ కంట్రోల్ సెంటర్ నుండి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం, సమన్వయం చేస్తూ కృషి చేయాలన్నారు. ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పోలీస్ కంట్రోల్ రూమ్ పరిశీలించిన ఎస్పి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News