Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:20 PM

పెద్దకాపర్తిలో ఉచిత దంత వైద్య శిబిరం – గ్రామస్తులకు విస్తృత సేవలు

20-01-2026 159 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

గ్రామ సర్పంచ్ కాట వెంకటేశం నేతృత్వంలో నార్కట్‌పల్లిలోని కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఆధ్వర్యంలో పెద్దకాపర్తి గ్రామంలో భారీ ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరం గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.ఈ సందర్భంగా కామినేని డెంటల్ కళాశాలకు చెందిన వైద్యులు, విద్యార్థుల బృందం గ్రామస్తులకు నోటి ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. రోజూ పళ్ళు తోముకునే సరైన విధానాలు, నోటి పరిశుభ్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో కనిపించే సాధారణ దంత సమస్యలపై ప్రత్యేక సూచనలు చేశారు.దంత సమస్యలతో బాధపడుతున్న వారిని ఉచితంగా పరీక్షించి, అవసరమైన చికిత్స వివరాలను తెలియజేశారు. తీవ్రమైన చికిత్స అవసరమైన వారికి ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తామని వైద్యులు తెలిపారు. అలాగే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లే రోగుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ఈ శిబిరంలో సర్పంచ్ కాట వెంకటేశం, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు యాదయ్య, తెలుసూరి నరసింహ, పంచాయతీ కార్యదర్శి గౌతమ్ రెడ్డి, డెంటల్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పెద్దకాపర్తిలో ఉచిత దంత వైద్య శిబిరం – గ్రామస్తులకు విస్తృత సేవలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News