Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ప్రళవి గార్డెన్స్‌లో ఘనంగా మార్షల్ ఆర్ట్స్ బెల్ట్ ప్రమోషన్

08-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మవిశ్వాసం–ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ కీలకం

ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రళవి గార్డెన్స్‌లో డైనమిక్ టైక్వాండో క్లబ్, గంఘాన్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ స్థాయి మార్షల్ ఆర్ట్స్ కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రతినిధి, బ్లాక్ బెల్ట్, బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జాతీయ బాడీ బిల్డర్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్షల్ ఆర్ట్స్ కేవలం ఒక క్రీడ మాత్రమే కాదని, అది ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణతో పాటు ప్రతి విద్యార్థి శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా బలంగా తీర్చిదిద్దే గొప్ప విద్య అని అన్నారు. నేటి యువత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా సమాజానికి అవసరమైన ధైర్యం, క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు.ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణలో ముందుండాలంటే మార్షల్ ఆర్ట్స్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పరీక్షాధికారి ప్రవీణ్ కుమార్, కోచ్‌లు మణిదీప్, రజని, వెంకట్, సాయి కుమార్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రళవి గార్డెన్స్‌లో ఘనంగా మార్షల్ ఆర్ట్స్ బెల్ట్ ప్రమోషన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News